1, జులై 2019, సోమవారం

Doctor's day wishes



వైద్యో నారాయణో హరిః

రోగమొస్తే బాధపడతాం
బాధపోయే దారి చూస్తాం
నాడి చూసి, నాల్క చూసి
పొట్టనొక్కి, కాలుగీరి
గుండె తీరును వడిసి బట్టి
మందులిచ్చే డాక్టరయ్యల
హస్తవాసికి తలలు వంచి
గుండెనిండిన ప్రేమతోటి
ధన్యవాదం తెలుపుకుంటాం.

అందమైన తోలువెనుక
దాగిఉన్నా నలత కోసం
టెస్టు చేసి, ఫొటోతీసి
బెస్టువేలో  గుట్టు లాగీ
స్పర్శతోటే ధైర్యమిచ్చి
భయం లేదని అభయమిచ్చి
భరోసాతో భవితనిచ్చే
డాక్టరయ్యకు ధన్యవాదం.

మలం, మూత్రం
పడిశ, కళ్ళే
నీకు నాకూ ఏవగింపు
బ్రతుకు నిచ్చే డాక్టరయ్యకు
తల్లి మనసూ ఉండునేమో?
ఏవగింపుకు అతనుదూరం
రోగి క్షేమమె అతని ధ్యేయం.

అన్నివేళల ఏడ్పు బాధల
దుఃఖ జనులూ చుట్టు ముట్టే
డాక్టరయ్యా నీదు మోమున
ముదము చిందే నవ్వునెపుడూ
దేవుడెప్పుడు నీయవలెను.

విష్ణుదేవుని అంశ యంటూ
మొక్కి వందన మీయగలరు
ప్రజలు భక్తితొ నితనికి.
పృథివి మొత్తం తిరిగి చూడగ
అన్యులెవరూ పొందలేరు
ఇంత గౌరవ మెప్పుడూ.

(వైద్యులు బ్రతుకు నిచ్చే వేదవేద్యులు....వారికి నా హృదయ పూర్వక వందనం. డాక్టర్స్ డే శుభాకాంక్షలతో....)

SSS SRINIVAS VEMURI

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి