2, జులై 2019, మంగళవారం

Mirchi bajji


ఆనందానికి ఆర్చి

శనగ పిండిలో ముంచీ
పచ్చని తొడుగుగ మార్చీ
నూనెలొ బాగా కాల్చీ
వామూ ఉల్లీ దూర్చీ
నిమ్మను కొద్దిగ కూర్చీ
తినగా ముక్కును కార్చీ
అలరించావా మిర్చీ

వానాకాలం వచ్చీ
నీ ఘుమ ఘుమలూ తెచ్చీ
అంగట్లోనికి చేర్చీ
నిలబడి రుచినే చూసీ
కారంతోటీ ఆర్చీ
నాట్యం చేయును మనిషీ

నమిలే కోరిక కసితో
దూరం పెట్టీ శుచినీ
ఆస్వాదించగ రుచినీ
రోడ్డు పక్కకు చేర్చీ
చిత్రం చేసే మిర్చీ
ఆనందానికి ఆర్చీ

SSS SRINIVAS VEMURI
Srikakulam, 9492732042

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి